![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -799 లో.. రిషి ఏంజెల్ కోసం చపాతి చేస్తుంటాడు. నువ్వు ఎందుకు ఎప్పుడు లవ్ లో ఫెయిల్ అయిన వాడిలాగా డల్ గా ఉంటావ్? నీకు లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని రిషిని అడుగుతుంది ఏంజెల్. రిషి సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే ఏంజెల్ కి వసుధార కాల్ చేస్తుంది. నొప్పి తగ్గిందా అని అడుగుతుంది వసుధార.. తగ్గింది నువ్వు మా ఇంటికి రావొచ్చు కదా వసు.. నేను చపాతి చేస్తున్నాను, రిషి నాకు హెల్ప్ చేస్తున్నాడని వసుధారతో ఏంజెల్ అంటుంది. అలా ఏంజెల్ చెప్పగానే.. వసుధార, రిషి ఇద్దరు కలిసి చపాతీలు చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటుంది వసుధార. కాసేపు వాళ్ళిద్దరి మాటలు విన్న రిషి మౌనంగా ఉంటాడు. నాతో కలిసి చపాతి చేసినట్లే ఏంజెల్ తో కూడా కలిసి చేస్తున్నాడా... రిషి సర్ గురించి తప్పుగా అనుకోవద్దని వసుధార అనుకుంటుంది.
మరొకవైపు మహేంద్ర రెడీ అయి బయటకు వెళ్తుంటే.. ఏంటి మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నాడని జగతి అనుకొని తనకి మెసేజ్ చేస్తుంది. అలా మెసేజెస్ చేయగానే మహేంద్ర చూసి.. ధరణికి ఫోన్ చేసి ఫోన్ ని స్పీకర్ లో పెట్టమంటాడు.. పక్కనే జగతి ఉంటుంది. "నీ ప్రాబ్లెమ్ ఏంటి? నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నావ్? నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి? నా కొడుకుని నాకు దూరం చేసావ్" అని మహేంద్ర ఇండైరెక్ట్ గా జగతితో అంటాడు. మహేంద్ర అన్న మాటలకు జగతి బాధపడుతుంది. ఆ తర్వాత మహేంద్ర కాల్ కట్ చేస్తాడు. చిన్నఅత్తయ్య.. ఎన్ని రోజులు ఇలా ఉంటారు. ఇప్పటికైనా నిజం చెప్పండని జగతితో ధరణి అంటుంది. మరొక వైపు మహేంద్ర వసుధారని కలవడానికి కాలేజీ వస్తాడు. మహేంద్రని చూసిన వసుధార.. కాలేజీ ఫ్యూన్ తో తను లేనని చెప్పిస్తుంది. మహేంద్ర తిరిగి వెళ్లిపోతుండగా మహేంద్రను రిషి చూస్తాడు. ఈ వసుధార నా గురించి ఏమైనా చెప్పిందా అని కోపంగా ఉంటాడు రిషి. నిజం చెప్పలేదు.. నేను ఇక్కడ లేనని ఫ్యూన్ తో చెప్పించానని.. మీకోసమే అబద్ధం చెప్పానని రిషికి వసుధార వాయిస్ మెసేజ్ చేస్తుంది. అప్పటిదాకా కోపంగా ఉన్న రిషి.. అది విని నార్మల్ అవుతాడు.
ఆ తర్వాత కేడి బ్యాచ్ తమ తప్పు తెలుసుకొని కాలేజీలో మోకాళ్ళ పై కూర్చొని ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులకి లెక్చరర్లని క్షమాపణ అడుగుతారు కేడీబ్యాచ్. రిషి సర్ వల్లే మా తప్పు తెలిసిందని కేడి బ్యాచ్ అంటారు. మరొకవైపు దారిలో వెళ్తుండగా.. మహేంద్ర కార్ ఆగిపోవడంతో మెకానిక్ కోసం చూస్తుంటాడు. అటుగా వెళ్తున్న చక్రపాణిని మహేంద్ర చూసి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. చక్రపాణిని మహేంద్ర పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |